బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఇవాళ ఉదయం కొన్ని క్షణాలపాటు సహనం కోల్పోయారు. ఉదయం ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు అక్కడ భారీగా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడారు. దాంతో పోలీసులు, బాడీగార్డులు అందరినీ పక్కకు నెడుతూ ఆయనను కారు దగ్గరికి తీసుకొస్తున్నారు.
అదే సమయంలో ఓ మద్ధతుదారుడు సిద్ధరామయ్యను కలిసే ప్రయత్నం చేశాడు. మరింత దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుండగా సిద్ధరామయ్య అతడి చెంపపై కొట్టాడు. అనంతరం అతనితో ఏదో మాట్లాడి కారువైపు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా చెంపదెబ్బ తిన్న మద్దతుదారుడు కూడా సిద్ధరామయ్య వెనుకాలే నవ్వుతూ కారు దగ్గరికి వెళ్లాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#WATCH | LoP and former Karnataka CM Siddaramaiah slaps a supporter who came to meet him at his residence in Bengaluru earlier today. The supporter had come to him amid a huge crowd of visitors there. pic.twitter.com/968Ba1t9DB
— ANI (@ANI) March 24, 2023