Snake Viral Video | సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. చాలా సందర్భాల్లో భారీ సర్పాలు పలు జంతువులను వీడియోలు చూసే ఉంటారు. అయితే, ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ పిల్లి పిల్లను నాగుపాము మింగింది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా వణికిపోతారు. ఇప్పటి వరకు కొండచిలువలు వంటివి మాత్రమే జంతువులను మింగడం చూసి ఉంటారు. కానీ, ఓ కోబ్రా జంతువులను పట్టి తినడం అరుదైన ఘటనే. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ స్నేక్ క్యాచర్ మురళీ వాలే హౌస్లా తన తన ఫేస్బుక్ అకౌంట్లో ఈ వీడియోను షేర్ చేశారు.
పిల్లి పిల్లను మింగిన నాగుపాము ఓ ఇంట్లో దాక్కున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. మురళీ ఆ పామును పట్టుకునేందుకు ఆ ఇంటికి వచ్చారు. ఆ ఇంట్లో మూలన నక్కిన కోబ్రా.. బుసలు కొడుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆవేశంగా ఉన్న పాము పడగను విసిరింది. కొద్ది సేపు ప్రయత్నించిన తర్వాత మురళీ నాగుపామును పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. బయటకు వచ్చిన పాము పిల్లిని బయటకు ఉమ్మివేసింది.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ గుండెల్లో వణుకు పుట్టేలా ఉన్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోను దాదాపు 7 కోట్ల మంది వీక్షించగా.. 6 లక్షల మంది లైక్ చేశారు. మురళీవాలే ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్కు చెందిన సామాజిక కార్యకర్త, స్నేక్ క్యాచర్. ఇప్పటి వరకు ఆయన దాదాపు 8వేల వరకు పాములను పట్టుకున్నారు. అదే సమయంలో పలు జంతువులను సైతం కాపాడారు. సోషల్ మీడియాలో ఆయనకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ఆయన పాముకాటుకు గురయ్యారు. వలలో చిక్కుకున్న పామును కాపాడే ప్రయత్నంలో చేతి వేలిపై నాగుపాము కాటు వేసింది. దాంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.