Viral video : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటికే అధికార ఎన్డీయే (NDA) గెలుపు ఖాయమైంది. ఎన్డీయే ఏకంగా 190కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. మహాగఠ్బంధన్ మాత్రం కేవలం 36 స్థానాల లీడ్కే పరిమితమైంది. దాంతో బీహార్లోని బీజేపీ కార్యాలయం దగ్గర సంబురాలతో సందడి నెలకొన్నది. ఆర్జేడీ కార్యాలయం వెలవెలబోయింది.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన యూట్యూబర్ రతన్ రంజన్..ఆర్జేడీ అవహేళన చేస్తూ ఓ వీడియోను రూపొందించారు. ఆర్జేడీ ఎన్నికల గుర్తు అయిన లాంథర్ను ఎడమ చేతిలో, జేడీయూ ఎన్నికల గుర్తు అయిన బాణంను కుడి చేతిలో పట్టుకుని.. లాంథర్ను బాణంతో పొడుస్తూ ఆయన వీడియో చేశారు. ఈ సందర్భంగా ఆయన.. తాము గతంలో లాలూ ఆటవిక పాలనను చూశామని అన్నారు.
లాలూ పాలనకు, ఎన్డీయే పాలనకు చాలా తేడా ఉన్నదని రతన్ రంజన్ చెప్పారు. ఎన్డీయే పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. బీహార్ ప్రజలు ఈ ఎన్నికల్లో అభివృద్ధికే ఓటేశారని అన్నారు. మహాగఠ్బంధన్ది సనాతన ధర్మానికి వ్యతిరేకమైన సిద్ధాంతమని, కాబట్టి మా ఐడియాలజీ, వారి ఐడియాలజీ ఒక్కటి కాలేవని వ్యాఖ్యానించారు. కాగా రతన్ రంజన్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH | #BiharElection2025 | Delhi: A social media influencer, Ratan Ranjan, dresses up as RJD chief Lalu Prasad Yadav and carries an Arrow (JDU symbol) and Lantern (RJD symbol) to the BJP HQ.
He says, “…I belong to Vaishali in Bihar. We have seen the era when there was… pic.twitter.com/ppLH7FD0mm
— ANI (@ANI) November 14, 2025