36 ఏండ్ల క్రితం రాయల్ ఎన్ఫీల్డ్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !
Royal Enfield | రాయల్ ఎన్ఫీల్డ్.. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైకుల్లో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా నడపాలని అనుకుంటారు కొందరు. దీనిని స్టేటస్‌గా భావిస్తుంటారు మరికొందరు. బైక్‌పై వెళ్తూ రాజసాన్ని
న్యూఢిల్లీ: రాయల్ ఎన్ఫీల్డ్.. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైకుల్లో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా నడపాలని అనుకుంటారు కొందరు. దీనిని స్టేటస్‌గా భావిస్తుంటారు మరికొందరు. బైక్‌పై వెళ్తూ రాజసాన్ని వలకబోస్తుంటారు మరికొందరు. వీటిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయుల మదిని దోస్తూనే ఉన్నది. ఈ లెజండరీ బైక్‌కు కొన్ని టెక్నికల్ మార్పులు చేసిన కంపెనీ.. ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌ను విక్రయిస్తున్నది. ప్రస్తుతం దీని షోరూం ధర రూ.2 లక్షల 20 వేలు. అయితే 36 ఏండ్ల కింద దీని ధర ఎంతో తెలిస్తే ప్రతిఒక్కరూ షాకవ్వాల్సిందే.. అక్షరాల రూ.18,700. అవును ఇది నిజమేనండి బాబు.

జార్ఖండ్‌లోని బొకారోలో సందీప్ ఆటో కంపెనీ అనే డీలర్ ఈ బైక్‌ను రూ.18,700కు విక్రయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బిల్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. 1986, జనవరి 23న రాసిన ఆ బిల్లును బీయింగ్ రాయల్ అనే పేరుతో అకౌంట్ కలిగిన ఓ వింటేజ్ బైక్ ఔత్సాహికుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీంతో ఇది తెగ షేర్ అవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

