Viral news : ఆమె ఒక పాఠశాలలో టీచర్..! వయస్సు 25 ఏళ్లు..! అతనో మైనర్ బాలుడు..! వయసు 16 ఏళ్లు..! ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయం అయ్యారు..! ఆ పరిచయం ప్రేమగా మారింది..! బాలుడి తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు..! విషయం తెలుసుకున్న బాలుడి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన 25 ఏళ్ల యువతి స్థానికంగా ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా మీరట్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి మొబైల్ నెంబర్ ఒకరికి ఇచ్చుకున్నారు. తరచూ ఫోన్లలో మాట్లాడుకున్నారు. దాంతో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది.
తర్వాత ఆ టీచర్ కారులో మీరట్‌కు వచ్చి బాలుడిని వెంట తీసుకెళ్లింది. ఘజియాబాద్‌లో అతడిని రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంది. అందుకోసం బాలుడు మేజర్ అన్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించింది. ఇంతలో కొడుకు పెళ్లి విషయం తెలుసుకున్న పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆ టీచర్ తమ కుమారుడికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుందని, తమ కుమారుడి మైనర్ అయినా మేజర్ అన్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిందని ఆరోపించారు.
కానీ మీరట్‌లోని లిసాడా గేట్ ఏరియా పోలీసులు వారి ఫిర్యాదును పట్టించుకోలేదు. దాంతో బాధితులు విషయాన్ని మీరట్ అడిషనల్ డీజీ ధ్రువ్కాంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు లిసాడా గేట్ ఏరియాలో పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో బాలుడు మైనర్ అని తేలితే వారి పెళ్లి రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మైనర్ అని రుజువు కాకపోతే వారి పెళ్లి చట్టబద్ధం కానుంది.