న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ మంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్‌కు తీహార్ జైల్లో వీఐపీ మర్యాదలు చేసినట్లు ఆరోపణలు రావడంతో.. ఆ జైలు సూపరింటెండెంట్ అజిత్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వేసిన ఎంక్వయిరీ కమిటీ సిఫారసు మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సత్యేందర్ జైన్‌ను ఉంచిన జైలు నెంబర్ 7 సూపరింటెండెంట్ అక్రమాలకు పాల్పడుతున్నాడని, ఆప్ మంత్రికి వీఐపీ మర్యాదలు చేస్తున్నాడని ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎంక్వయిరీ కమిటీ వేశారు. ఎంక్వయిరీ ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు.