ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ అశాంతి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెంగ్నోపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాల తాత్కాలిక పోస్ట్‌పై మిలిటెంట్లు దాడులు చేశారు. కుకీ మిలిటెంట్లుగా భావిస్తున్న వారు చేసిన ఈ దాడిలో ఇద్దరు పోలీస్ కమెండోలు మృతి చెందారు. దీంతో మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ తాత్కాలిక పోస్ట్‌పై మిలిటెంట్లు బాంబులతో దాడి చేసి కాల్పులు జరపడమే కాక ఆర్పీజీ షెల్స్ ప్రయోగించారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.