భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధన్మోడ్ పట్టణంలో నోటరీ లాయర్, ప్రైవేట్ పాఠశాల యజమాని వినోద్ డోంగ్లే కాసేపు కుబేరుడిగా మారారు. ఆయన శుక్రవారం తన డీమ్యాట్ అకౌంట్‌ను చూసేసరికి అందులో రూ.2817,41,29,408 బ్యాలెన్స్ కనిపించింది. దీంతో ఆయన తన కళ్లను తానే నమ్మలేకపోయారు.
ప్రపంచంలోని లాటరీలన్నిటినీ తానే గెలుచుకున్నాననే భావన కలిగిందన్నారు. తన దశ రాత్రికి రాత్రే మారిపోయిందని అనుకున్నానని చెప్పారు. కొద్ది క్షణాల్లోనే తప్పును సంబంధిత వర్గాలు సరిదిద్దడంతో డోంగ్లే తాత్కాలిక బిలియనీర్ స్టేటస్ మాయమైంది.