దేవాస్: మధ్యప్రదేశ్‌లో గాయపడ్డ ఓ చిరుత(Leopard)తో స్థానిక గ్రామస్థులు ఆటాడుకున్నారు. ఇక్లేరా గ్రామ సమీపంలో ఓ చిరుత అనారోగ్యంగా కనిపించింది. దీంతో స్థానికులు దాని చుట్టూ చేరారు. ఆ చిరుతను పట్టుకుని ర్యాలీ తీశారు. ఓ పెంపుడు జంతువులా చూశారు. దేవాస్ జిల్లాలోని ఇక్లేరా పరిసర ప్రాంతాల్లో చిరుత ఇటీవల సంచరించింది. తొలుత ఆ చిరుతను చూసి స్థానికులు కలవరపడ్డారు. అయితే అది గాయపడినట్లు గుర్తించిన తర్వాత, దాన్ని పట్టుకున్నారు.
Rescue operation underway by forest officials in Madhya Pradesh’s Iklera village after a leopard was found by locals in a dazed state. pic.twitter.com/Op5d4wrhem
— Upendrra Rai (@UpendrraRai) August 30, 2023
ఇక గ్రామస్థులంతా దాని వద్దకు చేరుకుని, దాంతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఓ పెంపుడు జంతువులా దాన్ని చూశారు. కొందరైతే సెల్ఫీలు దిగారు. ఇక ఓ వ్యక్తి ఏకంగా ఆ చిరుతపై కూర్చుకున్నట్లు రైడ్ చేశాడు. చిరుత గురించి స్థానికుడు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉజ్జెయిని నుంచి రెస్క్యూ టీమ్ చేరుకుని దాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు.
గ్రామస్థులకు చిరుత చిక్కిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రెండేళ్ల ఆ చిరుతను చికిత్స కోసం భోపాల్‌లోని వన్ విహార్ తీసుకువెళ్లినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ సంతోష్ శుక్లా తెలిపారు. ఆ చిరుతు కండీషన్ ప్రస్తుతం క్రిటికల్‌గా ఉంది. పశువైద్యుడు దానికి చికిత్స చేశాడు.
VIDEO | Rescue operation underway by forest officials in Madhya Pradesh’s Iklera village after a leopard was found by locals in a dazed state. “A team from Ujjain is reaching to capture the leopard and the animal will be shifted based on the directions of the higher officials,”… pic.twitter.com/NHpS0f1Mx6
— Press Trust of India (@PTI_News) August 30, 2023