పాట్నా: మద్యం తాగిన వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్రామస్తులు పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టారు. పోలీసులపై దాడి చేశారు. (Bihar Villagers Attack Cops) ఈ సంఘటనలో ఒక పోలీస్ గాయపడ్డాడు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో మద్యం సేవించడం, విక్రయించడం, నిల్వ చేయడం నిషేధం. అయితే అకోల్హి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యం సేవించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీస్ వాహనంలో అక్కడకు చేరుకున్నారు.
కాగా, మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలో అతడ్ని కూర్చోబెట్టారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించడానికి ప్రయత్నించారు. ఇంతలో గ్రామస్తులు ఆ పోలీస్ వాహనం చుట్టూ గుమిగూడారు. పోలీసులపై దాడి చేశారు. మహిళలు, పిల్లలతో సహా గుంపుగా ఒక పోలీస్‌ను నెట్టడంతోపాటు అతడి చెంపపై కొట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విడిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీహార్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.
On Camera, Bihar Villagers Attack Cops Who Went To Arrest Drunk Men https://t.co/CMFiyg2pwd pic.twitter.com/FMuRq6bfdv
— NDTV (@ndtv) April 10, 2025