దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించనున్నది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్'ను ప్రయోగించేందుకు హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్' సిద్ధమైంది.
- 12-16 మధ్యన నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధం
- 3 పేలోడ్లతో ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం
- సరికొత్త చరిత్ర సృష్టించనున్న స్కైరూట్ ఏరోస్పేస్
- ఆకాశమే హద్దుగా హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించనున్నది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ను ప్రయోగించేందుకు హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సిద్ధమైంది. ఈరాకెట్ ద్వారా మూడు కస్టమర్ పేలోడ్లను నింగిలోకి పంపనున్నారు. ఈనెల 12-16 మధ్యన ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు స్కైరూట్ మంగళవారం ప్రకటించింది.
ఈ సంస్థకు ఇదే తొలి ప్రయోగం. దీనికి ‘ప్రారంభ్’ అని నామకరణం చేశారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు అధికారులు ఈ నెల 12-16 మధ్యన లాంచ్ విండోను నోటిఫై చేశారని, వాతావరణ పరిస్థితులనుబట్టి తుది ప్రయో గ తేదీ ఖరారవుతుందని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్‌కుమార్ చందన వివరించారు.
ఇటీవల బెంగళూరులో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇతర అధికారులతో సమావేశమై ఈప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించినట్టు తెలిపారు. విక్రమ్-ఎస్ రాకెట్‌ను చాలా తక్కువ కాలంలోనే తయారుచేసి ప్రయోగానికి సిద్ధం చేయగలిగామని, ఇస్రోతోపాటు ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) నుంచి తమకు అమూల్యమైన తోడ్పాటు అందడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
విక్రమ్-ఎస్ ప్రయోగంతో దేశంలోనే తొలిసారి నింగిలోకి రాకెట్‌ను పంపిన ప్రైవేట్ కంపెనీగా ‘స్కైరూట్ ఏరోస్పేస్’ చరిత్ర సృష్టించనున్నది. సింగిల్ స్టేజ్ సబ్-ఆర్బిటాల్ వాహకనౌక అయిన ‘విక్రమ్-ఎస్’ రాకెట్ ద్వారా 3 కస్టమర్ పేలోడ్లను నింగిలోకి పంపనున్నారు. విక్ర మ్ సిరీస్ రాకెట్లకు సంబంధించిన పలు సాంకేతికతలను పరీక్షించి, వాటి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ ప్రయోగం ఉపకరిస్తుందని స్కైరూట్ ఏరోస్పేస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాగభరత్ డాకా పేర్కొన్నారు.
ఒప్పందం చేసుకొన్న తొలి స్టార్టప్ ఇదే
స్పేస్ సెక్టార్లో స్కైరూట్ నూతన ఆవిష్కరణలతో విజయవంతంగా దూసుకుపోతున్నది. వాణిజ్య ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు అత్యాధునిక రాకెట్లను తయారు చేయడంలో నిమగ్నమైన ఈ కంపెనీ.. రాకెట్ల తయారీ ఖర్చును తగ్గించడం ద్వారా ఉపగ్రహ ప్రయోగాలను చౌకగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. గతంలో రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకొన్న స్కైరూట్ ఇస్రోతో ఒప్పందం చేసుకున్న తొలి భారత స్టార్టప్ కంపెనీగా నిలిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- private rocket
- vikram-s
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

