బెంగుళూరు: చంద్రయాన్-3(Chandrayaan-3) మిషన్‌లో భాగంగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ దాదాపు చంద్రుడి ఉపరితలానికి చేరుకున్నది. ఎల్లుండి సాయంత్రం చందమామపై ఆ ల్యాండర్ దిగే ఛాన్సు ఉంది. అయితే చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే.ఆ ఆర్బిటార్ .. విక్రమ్‌కు వెల్కమ్ చెప్పింది. ఇస్రో తన ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. వెల్కమ్ బడ్డీ అంటూ ఆ మెసేజ్‌లో పోస్టు చేశారు. చంద్రయాన్-2 ఆర్బిటార్, చంద్రయాన్-3 ల్యాండర్‌తో టూ వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు ఇస్రో తెలిపింది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5.20 నిమిషాల నుంచి విక్రమ్ ల్యాండింగ్‌పై లైవ్ టెలికాస్ట్ ఉంటుందని ఇస్రో వెల్లడించింది.
Chandrayaan-3 Mission:
‘Welcome, buddy!’
Ch-2 orbiter formally welcomed Ch-3 LM.Two-way communication between the two is established.
MOX has now more routes to reach the LM.
Update: Live telecast of Landing event begins at 17:20 Hrs. IST.#Chandrayaan_3 #Ch3
— ISRO (@isro) August 21, 2023