న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్ రహత్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం శనివారం నోటిషికేషన్ జారీ చేసింది. తక్షణమే అమె నియామకం అమలులోకి వస్తుందని తెలిపింది.
ఈ పదవిలో ఆమె మూడేండ్ల పాటు కొనసాగుతారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రహత్కర్, 1995 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. ఆమెతో పాటు కమిషన్ సభ్యురాలిగా అర్చనా మజుందార్‌ను నియమించినట్టు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ తెలిపింది.