చెన్నై: వచ్చే ఏడాది తమిళనాడుకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి నటుడు విజయ్ దళపతి అని తమిళగ వెట్రి కళగం పార్టీ బుధవారం ప్రకటించింది.
మహాబలిపురంలో జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎన్నికల పొత్తుకు సంబంధించి కమిటీకి విజయ్ పూర్తి అధికారాలు ఇచ్చినట్టు పార్టీ తెలిపింది.