న్యూఢిల్లీ : ఓ శునకం అద్భుతమైన గోల్‌కీపింగ్ నైపుణ్యాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యోధ4ఎవర్ ట్విట్టర్ ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో గోల్ పోస్ట్ వద్ద కుక్క బాల్‌ను సేవ్ చేయలేదు.
యజమాని ప్లాస్టిక్ బాటిల్‌ను తనవైపు తోయగా దాన్ని కుక్క లాఘవంతో తన నోటకరుచుకుంది. తన యజమానితో ఆటలాడే సమయంలో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో కుక్క వైపు ఓ వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్‌ను కిక్ చేస్తుండగా అది తనను దాటి వెళ్లకుండా కుక్క అద్భుతమైన మూమెంట్స్‌తో ఆకట్టుకుంది.
He's an excellent goalkeeper..🐶🐾🥅🤯 pic.twitter.com/d0wLn6oIJC
— 𝕐o̴g̴ (@Yoda4ever) November 7, 2022
ఈ వీడియోలో కుక్క ఏకాగ్రతను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. హి ఈజ్ యాన్ ఎక్సలెంట్ గోల్‌కీపర్ అని ఈ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. కుక్క గోల్‌కీపింగ్ నైపుణ్యాలు అద్భుతమని పలువురు యూజర్లు ప్రశంసలు గుప్పించారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ పది లక్షలు పైగా వ్యూస్ లభించాయి.