న్యూఢిల్లీ : షెడ్లో కూరుకుపోయిన పిల్లిని కాపాడిన కుందేలు వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బీఅండ్ఎస్ అనే పేజ్ ఈ వైరల్ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 30 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో ఓ షెడ్ కింద చిక్కుకున్న పిల్లిని బయటకు వచ్చేలా కుందేలు తన కాలితో మట్టిని తవ్వుతుండటం కనిపిస్తుంది.
This rabbit saving a cat who couldn’t find its way out pic.twitter.com/VsDk2HAc9Y
— B&S (@_B___S) May 13, 2023
మట్టిని తొలగించి గుంట చేయడంతో దాన్నుంచి పిల్లి బయటపడటం కనిపిస్తుంది. బయటికివచ్చే దారిలేక బిక్కుబిక్కుమంటున్న పిల్లిని ఈ కుందేలు కాపాడిందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్లిప్‌ను చూసిన సోషల్ మీడియా యూజర్లు కుందేలు ఔదార్యంపై ప్రశంసలు గుప్పించారు. కుందేలును లిటిల్ జెంటిల్మన్ అంటూ పొగడ్తలతో కామెంట్స్ సెక్షన్‌ను ముంచెత్తారు.