న్యూఢిల్లీ : సౌత్ ఇండియన్ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ డిష్‌గా పేరొందిన దోశను అన్ని ప్రాంతాల వారు ఇష్టంగా ఆరగిస్తారు. మైసూర్ మసాలా దోశ నుంచి రవ్వ దోశ వరకూ ఎన్నో రకాల దోశలు ఊరిస్తుంటాయి. అయితే సోషల్ మీడియాలో విచిత్ర ఫుడ్ కాంబినేషన్లు వైరల్ అవుతుండగా లేటెస్ట్గా ఓ వ్యక్తి పాన్ దోశను తయారుచేసిన వీడియో (Viral video) నెట్టింట సందడి చేస్తోంది.
ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్ డిష్‌పై యూజర్లు తలోరకంగా స్పందించారు. హ్యాపీ ఆన్ ట్విట్టర్ అనే యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెండు నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో తమలపాకులతో తయారు చేసిన గ్రీన్ బ్యాటర్‌ను దోశ పెనంపై పోయడం కనిపిస్తుంది. కొద్ది సేపటికి దోశపై వెన్నను జోడించడం చూడొచ్చు.
Paan Dosa 🙄🙄🙄🙄
Time to leave this planet 😭🌏🫨 pic.twitter.com/RMZxIxvpeJ
— Happy 🇮🇳 (@happyfeet_286) May 30, 2023
ఆపై కట్ చేసిన్ పాన్, కిస్మిస్, ఆప్రికాట్స్, డేట్స్, టూటిఫ్రూటి, డ్రైఫ్రూట్స్‌ను వేసి ఆపై పాన్ సిరప్‌ను కూడా వేస్తాడు. ఈ వైరల్ క్లిప్‌ను చూసిన పలువురు యూజర్లు షాక్‌కు గురై ఇలాంటి ఫుడ్ కాంబినేషన్ అవసరమా అని ప్రశ్నిస్తారు. కాగా ఈ వీడియోను ఎక్కడ రికార్డు చేశారనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 1.4 లక్షల మంది వీక్షించారు. పాన్ దోశ : ఈ లోకాన్ని వీడే సమయం ఆసన్నమైందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఇక మయనీస్ దోశ, కెచప్ పాన్ గురించి వెయిట్ చేస్తున్నామని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇది పాన్ దోశనా, రేడియోయాక్టివ్ దోశనా అని మరో యూజర్ ప్రశ్నించారు.
Read More