న్యూఢిల్లీ : పెండ్లి అంటే ఈ రోజుల్లో ప్రీ వెడ్డింగ్ (Viral Post) ఫొటోషూట్స్ ముందువరసలో నిలుస్తాయి. డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ప్రాచుర్యం పొందాయి. అయితే స్నేక్‌తో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ గురించి మీరు వినకుంటే మాత్రం ఈ వైరల్ పోస్ట్‌పై లుక్కేయాల్సిందే. ఈ తరహా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ స్టోరీని వివేక్ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు.
ఓ జంటను పాము ఎలా కలిపిందనే విషయాన్ని ఈ ఫొటోలు వెల్లడిస్తాయి. ఈ ఫొటోలను పరిశీలిస్తే యువతి ఇంటి దగ్గర నడుచుకుంటూ వస్తుండగా పామును చూసి రెస్క్యూ సర్వీసులకు కాల్ చేస్తుంది. స్కూటీపై ఇద్దరు వ్యక్తులు రాగా ఓ వ్యక్తి మహిళవైపు చూసి నవ్వడం కనిపిస్తుంది. ఆపై వారు స్నేక్‌ను పట్టుకుని బాక్స్ లోపల ఉంచుతారు.
స్నేక్‌ను తీసుకుని వెళుతూ తనకు కాల్ చేయాలని ఆ వ్యక్తి మహిళకు సంకేతం ఇస్తాడు. ఆపై వారు ఫోన్లో మాట్లాడుతూ ప్రేమలో పడిపోతారు. చివరి ఫొటోలో స్నేక్‌తో నవ జంటను చూడొచ్చు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. షార్ట్ మూవీస్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ చేయాలని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More
Dream Dog House | పెంపుడు కుక్క కోసం రూ.16 లక్షల ఇల్లు.. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన యజమాని