న్యూఢిల్లీ : భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత అనిర్వచనీయం. ముఖ్యంగా వృద్ధ దంపతుల్లో ఒకరికి మరొకరు బాసటగా నిలవడం, నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే ధైర్యం అంతా ఇంతా కాదు. తాజాగా ఓ పెద్దావిడ తన భర్తకు స్వయంగా భోజనం తినిపిస్తున్న వీడియో పలువురిచే కంటతడి పెట్టించింది.
వారిద్దరికీ దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ వీడియోను అబా జియోన్ అనే యానిమేటర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 1.1 కోట్ల మంది వీక్షించారు. ఈ క్లిప్‌లో మహిళ ఓ వేడుకలో భర్తకు స్వయంగా తన చేతులతో ఫుడ్ తినిపిస్తుండటం కనిపించింది.
వృద్ధ దంపతులు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఇన్స్టాగ్రాం యూజర్లు ఆకాంక్షించారు. స్వచ్ఛమైన ప్రేమకు వీరే నిదర్శనమని పలువురు ప్రశంసలు గుప్పించారు.