న్యూఢిల్లీ : సంగీత ప్రియులను ఓ వీడియో అమితంగా ఆకట్టుకుంటోంది. షమ్మి కపూర్, షర్మిలా ఠాగూర్ల ఐకానిక్ సాంగ్ దీవానా హు బదల్ సాంగ్‌ను ఓ బాలుడు శ్రావ్యంగా ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలుడి గొంతులో పలికించిన మెలొడి నెటిజన్ల ముఖాలపై నవ్వులు పూయించింది. సనిధ్ జెత్వా అనే యూజర్ ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడు 1964లో విడుదలైన కశ్మీర్ కి కాళి మూవీలోని పాటను మధురంగా ఆలపించాడు. బాలుడి గొంతు శ్రావ్యంగా ఉండటంతో పాటు పాట ఆసాంతం ముఖంలో సరైన ఎక్స్ప్రెషన్స్ కూడా పలికించడం పలువురిని ఆకట్టుకుంది. పాత, ఎవర్గ్రీన్ సాంగ్స్‌ను ఇష్టపడే వారిని బాలుడు పాడిన తీరు ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ నెల ఇంటర్నెట్ ప్యాక్ ఖర్చు వృధా కాలేదని బాలుడి టాలెంట్‌ను ఓ యూజర్ ప్రశంసించగా, భారత మ్యూజిక్ భవితవ్యం భద్రంగా ఉంటుందని మరో యూజర్ కామెంట్ చేశారు.