న్యూఢిల్లీ : స్నేక్స్ గురించి వింటేనే వణికిపోయేవారు ఈ వీడియోకు దూరంగా ఉంటే మేలు. భారీ కొండచిలువను పట్టుకునేందుకు విసిరిన వలలో పైథాన్ చిక్కుకున్న వీడియో నిజంగా వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది. ఆడ్లీ టెర్రిఫైయింగ్ అనే ట్విట్టర్ పేజ్ ఈ వీడియోను మైక్రోబ్లాగింగ్ సైట్లో షేర్ చేసింది.
Python trap using live chicken pic.twitter.com/pM5fP5J36G
— OddIy Terrifying (@OTerrifying) November 16, 2022
ఈ వీడియోలో పైథాన్‌ను పట్టుకునేందుకు ఓ కోడి పిల్లని ఉంచి దాని ముందు పైప్‌ను అమర్చారు. కోడి పిల్ల కోసం దూసుకొచ్చిన కొండచిలువ పైప్‌లో ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతుండటం ఈ వైరల్ వీడియోలో కనిపిస్తుంది. కోడిని ఉపయోగిస్తూ పైథాన్‌కు ట్రాప్ అని ఈ వీడియోకు క్యాప్షన్‌గా ఇవ్వగా ఇప్పటివరకూ 50 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. భారీ పామును చూసి అందరూ భయపడుతున్నారని కామెంట్స్ సెక్షన్ పరిశీలిస్తే సులభంగా అర్ధమవుతోంది.
ఈ వీడియో పైశాచికంగా ఉందని పలువురు అభివర్ణించారు. ఈ పామును ఇలాగే వదిలేస్తే ఇది ఆహారం కోసం మనుషులకు హాని తలపెట్టేలా ఉందని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఈ వీడియో నాకు పీడకలను మిగిల్చేలా ఉందని మరో యూజర్ కామెంట్ చేశారు. నేనైతే నిలువునా వణికిపోయానని మరో యూజర్ రాసుకొచ్చారు. అసలు ఈ తతంగం తర్వాత కోడి బతికేఉందా అని మరొకరు ప్రశ్నించారు.