బీజింగ్ : చైనాలో కరోనా వైరస్ కేసులు వేగంగా ప్రబలుతుండటంతో వైరస్ నుంచి కాపాడుకునేందుకు ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాణాంతక వైరస్ బారిన పడకుండా చైనా దంపతులు వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు. కరోనా వైరస్‌ను నియంత్రణకు ఓ చైనా జంట భారీ గొడుగును కవచంగా ఉపయోగించుకుంటున్న వీడియోను పీపుల్స్ డైలీ చైనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. గొడుగును పట్టుకునేందుకు హ్యాండిల్ ఉండగా, ఈ భారీ గొడుగులో దంపతులు ఇద్దరూ బయటకు వచ్చి షాపింగ్ చేస్తున్నారు.
A Chinese couple takes self-protection to another level… pic.twitter.com/ovPlIaAeZg
— People's Daily, China (@PDChina) December 22, 2022
ప్లాస్టిక్ షీట్‌తో కూడిన ఈ భారీ గొడుగు దంపతుల పాదాలనూ కవర్ చేసింది. మార్కెట్లో సరుకులను కొనేందుకు విలక్షణ గొడుగుతో బయటకు వచ్చిన వీడియోను షేర్ చేస్తూ సెల్ఫ్ ప్రొటెక్షన్‌ను మరో స్ధాయికి తీసుకువెళ్లిన చైనా దంపతులు అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 83,000 మందికి పైగా వీక్షించారు.
ఈ గొడుగు వీరిని వర్షం నుంచి కూడా కాపాడుతుందని పలువురు యూజర్లు కామెంట్ చేశారు. అయితే ఈ విలక్షణ గొడుగు లోకల్ ట్రైన్లు, బస్సుల వంటి రద్దీ ప్రాంతాల్లో వాడేందుకు వీలు కాదని మరికొందరు రాసుకొచ్చారు. మరోవైపు కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తుండటంతో చైనా, దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ టెస్టులను విధిగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.