గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 20:38:48

కేకులు ఇలా క‌ట్ చేస్తే జైలుకే : త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

కేకులు ఇలా క‌ట్ చేస్తే జైలుకే : త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

అస‌లే క‌రోనా టైం. ఈ టైంలో పుట్టిన‌రోజు వేడుక‌లు, మ్యారేజ్ యానివ‌ర్శ‌రీలు ఎవైనా ఉంటే కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుపుకోండ‌ని ఎప్ప‌టి నుంచో హెచ్చ‌రిస్తున్నారు పోలీసులు. ఈ మాట‌ల‌ను పెడ‌చెవిన పెట్టి త‌న 25వ పుట్టిన‌రోజు వేడుక‌ను 25 కేకుల‌తో సెల‌బ్రేట్ చేసుకొని ఫేమ‌స్ అయ్యాడు. వైర‌ల్ అయిన కాసేప‌టికే పోలీసులు అత‌న్ని అత్తారింటికి తీసుకెళ్లారు. అంటే జైల్లో వేశారు. ఇదేంటి కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసినందుకే అరెస్ట్ చేశారా అనుకుంటారేమో.. ఈ బ‌ర్త్‌డే బాయ్ చాక్‌తో కాకుండా పెద్ద క‌త్తినే చేత‌ప‌ట్టి క‌ట్ చేశాడు.

ఈ కేక్‌ల‌న్నింటినీ వ‌రుస‌గా పెట్టి ఒక్కొక్క‌టిగా క‌ట్ చేస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వేడుక‌లో 30 మందికి పైనే ఉన్నారు. పైగా అధికారుల నుంచి ఎలా అనుమ‌తి తీసుకోలేదు. దీనికితోడు ఒక్క‌రు కూడా సామాజిక దూరం పాటించ‌క‌పోగా అస‌లే మాస్కులు కూడా ధ‌రించ‌లేదు. బ‌ర్త్‌డే బాయ్ వాడిన ఖడ్గాన్ని మారణాయుధంగా పరిగణిస్తూ ముంబయి పోలీసులు వివిధ కేసుల కింద వారిని అరెస్టు చేశారు. మ‌రి ఇలా ఉంటే పోలీసులు అరెస్ట్ చేయ‌డంలో ఎలాంటి త‌ప్పు లేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ బ‌ర్త్‌డేను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేడు. ఇదే అత‌నికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటున్నారు. 

 


logo