Fire @ Delhi Rail Godown | ఢిల్లీ రైల్వే గోడౌన్లో అగ్ని ప్రమాదం.. అసలేం జరిగింది?
Fire @ Delhi Rail Godown | నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండీ ప్రాంతంలోని రైల్వే గోడౌన్లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.
Fire @ Delhi Rail Godown | నార్త్ ఢిల్లీలో ఆదివారం సాయంత్రం దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రతాప్నగర్ మెట్రో స్టేషన్కు సమీపంలోని సబ్జీ మండీ వద్ద గల రైల్వే గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని చెప్పారు. ఆదివారం సాయంత్రం 4.25 గంటలకు సబ్జీ మండిలోని రైల్వే గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే 14 ఫైరింజన్లు ఘటనా స్థలానికి తరలించామని అతుల్ గార్గ్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదన్నారు. తొలుత రెండు ఫైరింజన్లు పంపించారు. అటుపై ఏడు.. తర్వాత మరో ఏడుగు ఫైరింజన్లు పంపించినట్లు అగ్ని మాపక దళ అధికారులు తెలిపారు. మొత్తం 16 ఫైరింజన్లు మంటలు ఆర్పివేశాయి.
భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో నల్లని మబ్బులు ఈ ప్రాంతాన్ని కమ్మేశాయి. ప్రమాద కారణాలు తెలియకున్నా.. భారీ నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

