Traffic Violation | దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో పోలీసులంతా కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో పని చేస్తారు. తమది అవినీతి రహిత పాలన అని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు పదేపదే చెబుతుంటారు. కానీ ఢిల్లీలో ఒక దక్షిణ కొరియా పౌరుడు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రూ.5000 ఫైన్ వేశాడు. కానీ, రూ.5000లకు మాత్రం రశీదు ఇవ్వలేదు. నెల రోజుల క్రితం జరిగిన ఘటన సోషల్ మీడియాలో విస్త్రుతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈ సమాచారం బయటకు రావడంతో సంబంధిత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, ఘటనపై విచారణకు ఆదేశించారు పోలీసు ఉన్నతాధికారులు.
రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరించిన కొరియా పౌరుడ్ని రూ.5000 చెల్లించాలని చెప్పాడు. సంబంధిత వ్యక్తి రూ.500 ఆఫర్ చేశాడు. కానీ, తాను చెప్పింది రూ.5000 అని, రూ.500 కాదని కానిస్టేబుల్ వివరణ ఇచ్చాడు. ఇక చేసేదేం లేక సంబంధిత కొరియా పౌరుడు రూ.5000 క్యాష్ ఇచ్చేశాడు. కానీ, అతడికి రశీదు ఇవ్వలేదు. ఇందుకు కొరియా పౌరుడికి షేక్ హ్యాండ్ ఇవ్వడంతోపాటు కానిస్టేబుల్ ధన్యవాదాలు తెలుపుతున్న ద్రుశ్యం వీడియో కనిపిస్తున్నది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సదరు కానిస్టేబుల్ మహేశ్ చంద్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఢిల్లీ పోలీస్ ట్వీట్ చేసింది. కానీ, తాను రశీదు ఇచ్చేలోపు ఆ వ్యక్తి అక్కడినుంచి వెళ్లిపోయాడని కానిస్టేబుల్ మహేశ్ చంద్ వాదిస్తున్నాడు.