Vicky Koushal | యాక్టర్ విక్కీ కౌశల్, సారా అలీఖాన్ చిత్రమైన వివాదంలో ఇరుక్కున్నారు. ఓ షూటింగ్ నిమిత్తం వారిద్దరూ ఓ టూవీలర్‌పై రైడ్‌కి వెళ్లారు. ఇది సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. అయితే వారిద్దరూ రైడ్‌కు వెళ్లిన బైక్ నెంబర్, ఓ యాక్టివా బైక్ నెంబర్ ఒక్కటే అయ్యింది. దీంతో వివాదం ముదిరింది. తన నెంబర్‌ను ఆ బైక్‌కు ఎలా వాడతారంటూ యాక్టివా ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా ఆర్టీవోకు కూడా ఆయన యాక్టివా ఓనర్ ఫిర్యాదు చేశాడు. ఇలా ఒకే నెంబర్ వాడడం చట్టరీత్యా నేరమంటూ ఆర్టీవో ప్రకటించారు. దీనిపై యాక్టివా ఓనర్ జయసింహ యాదవ్ తీవ్రంగా స్పందించాడు. ‘ఎంపీ-09యూఎల్ 4872 అనేది నా బండి నెంబర్. నా బండి యాక్టివా. 2018, మే 25న ఎరోడ్రాం షోరూమ్‌లో కొనుక్కున్నాను. నా నెంబర్‌ను సినిమావాళ్లు వాళ్ల బండిపై ఎలా అతికించారు? ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఎవరు బాధ్యత తీసుకుంటారు?’ అంటూ జయసింహ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.
మరోవైపు ఇండోర్ ఆర్టీవో జితేంద్ర రఘువంశీ కూడా స్పందించారు. ఇలా ఓ వాహనానికి సంబంధించిన నెంబర్‌ను మరో వాహనానికి అతికించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇతర వాహనాల నెంబర్‌ను మరో వాహనదారు వినియోగించరాదని, దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జితేంద్ర రఘువంశీ తేల్చి చెప్పారు.