Jagdeep Dhankhar | న్యూఢిల్లీ : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(73) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో చేరారు. ఛాతీలో నొప్పి కారణంగా ధన్‌ఖడ్ ఆస్పత్రిలో చేరారని వైద్యులు తెలిపారు. ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని కార్డియాలజీ హెచ్‌వోడీ డాక్టర్ రాజీవ్ నారంగ్ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి క్రిటికల్ కేర్ యూనిట్(CCU) లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.