న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆదివారం జరిగే అవకాశం ఉంది. నేడు జరిగే ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఎంపిక చేసి, అభ్యర్థి పేరును సోమవారం ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. ఈ రేసులో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, గుజరాత్ గవర్నర్ దేవవ్రత్ ఆచార్య ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, బీహార్ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆరెస్సెస్ నేత శేషాద్రి చారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 19న ఎన్డీయే కూటమి పార్టీల సమావేశంలో బీజేపీ అభ్యర్థికి మిగతా పార్టీలు ఆమోదం తెలుపుతాయి.