ముంబై, ఏప్రిల్ 11: ప్రముఖ సినీ నేపథ్య గాయని ఆశా భోస్లే శనివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో చేరారు. ఛాతీ ఇన్ఫెక్షన్, నిస్సత్తువ కారణంగా ఆమెను దవాఖానలో చేర్చినట్టు ఆమె మనవరాలు జనాయ్ భోస్లే తెలిపారు. చికిత్స కొనసాగుతున్నదని, ఆమె ఆరోగ్యంపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
తమ ప్రైవసీని గౌరవించాలని కోరారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆశా భోస్లేకు గుండెపోటు వచ్చినట్టు అంతకుముందు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆశా భోస్లే వివిధ భారతీయ భాషల్లో 12 వేలకు పైగా పాటలు పాడారు.