న్యూఢిల్లీ: ఆర్డీ పరేడ్‌లో వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 73వ గణతంత్య్ర దినోత్సవ వేళ ఢిల్లీలో వివిధ రకాల యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. రఫేల్, జాగ్వార్, హెర్క్యూల్స్, సుఖోయ్ యుద్ధ విమానాలు రకరకాల ఫార్మేషన్స్‌తో అతిథులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 75 విమానాలతో గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. అయిదు రాఫేల్ విమానాలతో వినాశ్ ఆకారాన్ని ప్రదర్శించారు. ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సీ-130 జే సూపర్ హెర్క్యూల్స్ కూడా ఆర్డీ పరేడ్‌లో పాల్గొన్నది. కాక్పిట్లలో కెమెరాలను అమర్చి.. కొత్త తరహా కోణాల్లో విన్యాసాలను చూపించారు.
WATCH | Cockpit view of #Baaz formation comprising 1 Rafale, 2 Jaguar, 2 MiG-29 UPG, 2 Su-30 MI ac in seven ac 'Arrowhead' formation flying at 300m AOL. @IAF_MCC#RepublicDayWithDoordarshan
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
LIVE: https://t.co/83FcNn3fIz pic.twitter.com/6aUGn3Bez3
ఒక రాఫేల్, రెండు జాగ్వార్లు, రెండు మిగ్29, రెండు సుఖోయ్‌లతో బాజ్ ఫార్మేషన్ చేపట్టారు. బాణం ఆకారంలోనూ యుద్ధ విమానాలతో విన్యాసాలు చేశారు. మెన్ ఇన్ బ్లూగా పిలువబడే వైమానిక దళం.. యుద్ధ విమానాలతో స్టన్నింగ్ ఫార్మేషన్స్ చేసింది.
The #Netra formation comprising 1 AEW & C ac with 2 MiG 29 UPG + 2 Su-30 MKI ac in echelon flying in Arrowhead formation, after Traan formation, at 360m AOL flying over the majestic Rajpath on 73rd #RepublicDayParade #AzadiKaAmritMahotsav pic.twitter.com/xh8cofSDyz
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
ఒక ఏఈడబ్ల్యూ, రెండు మిగ్, రెండు సుఖోయ్‌లతో నేత్ర ఫార్మేషన్ చేశారు. 17 జాగ్వార్లతో అమృత ఫార్మేషన్ చేపట్టారు. గ్రూప్ కెప్టెన్ అవినాశ్ సింగ్, కెప్టెణ్ గౌరవ్ అర్జారియా, వింగ్ కమాండర్ సందీప్ జైన్, కెప్టెన్ ఎన్పీ వర్మ, వింగ్ కమాండర్ ప్రాకార్, వింగ్ కమాండర్ రోహిత్ రాయ్, సిద్ధార్ధ, అంకుశ్ తోమర్, పవార్లు జాగ్వార్లతో విన్యాసాలు నిర్వహించారు.
WATCH | Amrit formation comprises of 17 Jaguar ac making a figure of 75 is led by Gp Capt Avinash Singh, Gp Capt Gourav Arjariya, Wg Cdr Sandeep Jain, Gp Capt NP Verma, Wg Cdr Prakhar, Wg Cdr Rohit Rai, Wg Cdr Siddartha, Wg Cdr Ankush Tomar & Wg Cdr Pawar. pic.twitter.com/Xg0IC4jDn7
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
WATCH | Baaz formation
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
comprising 1 Rafale, 2 Jaguar, 2 MiG-29 UPG, 2 Su-30 MI ac in 'Arrowhead' formation.@IAF_MCC#RepublicDayWithDoordarshan
LIVE: https://t.co/83FcNnkQA7 pic.twitter.com/A3vllPAuxh