Road Accident | వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురాహి గ్రామంలో కారు, ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులను పిలిభిత్ జిల్లా గుర్తించారు. వారణాసికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. వివరాల్లోకి వెళితే.. లారీ వెనుక నుంచి కారు ఢీకొట్టగా.. కారులోని వ్యక్తులు కాశీలో వారణాసిలో అస్థికలు నిమజ్జనం చేసి తిరిగి వస్తున్నారు.
తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని దేశించార. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కాశీ విశ్వనాథున్ని ప్రార్థిస్తూ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.