న్యూఢిల్లీ: వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. వేగాన్ని అందుకొని మరో మైలురాయి సాధించింది! ఇందుకు సంబంధించి గురువారం రాజస్థాన్‌లో నిర్వహించిన ట్రయల్ రన్ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఎక్స్‌లో షేర్ చేశారు. 30 కి.మీ మేర సాగిన ట్రయల్ రన్లో రైలు 180 కి.మీ వేగాన్ని అందుకున్నప్పుడు నీళ్లతో నిండుగా ఉన్న గ్లాస్ తొణకకుండా స్థిరంగా ఉన్నట్టు వీడియోలో కనిపించింది. ఈ నెలాఖరు వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది. అనంతరం రైల్వే భద్రత కమిషనర్ వాటిని గరిష్ఠ వేగం వద్ద పరీక్షిస్తారు. వందే భారత్ స్లీపర్ తుది పరీక్షలో విజయవంతమైన తర్వాతే వాటిని ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తారు.