న్యూఢిల్లీ: వందే భారత్ స్లీపర్ క్లాస్ రైలు ట్రయల్ రన్లో గరిష్ఠంగా గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణించింది. పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రోహల్ఖుర్ద్-ఇంద్రఘర్-కోట సెక్షన్లో ఈ ట్రయల్ రన్ ఇటీవల జరిగింది. రైలు స్థిరత్వం, బ్రేకింగ్, ప్రయాణ అనుభవాలను ఇందులో పరీక్షించారు.
లోడుతో ఉన్నపుడు, ఖాళీగా ఉన్నపుడు కూడా పరీక్షించారు. రైలు గరిష్ఠ వేగంతో వెళ్తున్నపుడు నీటితో నిండిన మూడు గాజు గ్లాసులను ఉంచారు. ప్రయాణ సమయంలో ఆ గ్లాసుల్లోని నీరు కదల్లేదు.