Watch: ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టీసీ
Vande Bharat Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)లో ప్రయాణికుల టిక్కెట్లు తనిఖీ చేసే టీసీ (ticket checker) ఆ రైలు కింద పడే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అహ్మదాబాద్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)లో ప్రయాణికుల టిక్కెట్లు తనిఖీ చేసే టీసీ (ticket checker) ఆ రైలు కింద పడే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ముంబై వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అహ్మదాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే ఆ స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై ఆ రైలు టీసీ నిల్చొని ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కంపార్ట్మెంట్ డోర్లు మూసుకుపోయాయి. ఆ వెంటనే స్టేషన్ నుంచి ఆ రైలు కదిలింది.
కాగా, ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న టీసీ దీనిని గమనించి తేరుకున్నాడు. కంపార్ట్మెంట్ల డోర్లు మూసుకుపోవడంతో చివరన ఉన్న లోకోపైలట్ క్యాబిన్ వద్దకు పరుగెత్తాడు. డోర్ తెరువాలంటూ లోకోపైలట్‌ను కోరాడు. అంతేగాక రైలు కదులుతుండగా పాక్షికంగా తెరిచి ఉన్న లోకోపైలట్ ఉన్న క్యాబిన్లోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పి ఆ రైలు కింద పడబోయాడు. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు వెంటనే స్పందించి ఆ టీసీని కాపాడారు. ఈ నెల 26న అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://twitter.com/iShekhab/status/1674397068930998275?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1674397068930998275%7Ctwgr%5E83b87e044a91ba047f55be38f119156ee9b565d5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fvideo-ticket-checker-of-vande-bharat-express-had-a-narrow-escape-in-a-dramatic-fall-4166586
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

