ముంబై, అక్టోబర్ 29: వందే భారత్ రైలు మళ్లీ ప్రమాదానికి గురైంది. ఎద్దు ఢీకొట్టడంతో ముంబై-గాంధీనగర్ రైలు ముందు భాగం, ఒక కోచ్ దెబ్బతిన్నది. దీంతో 15 నిమిషాల పాటు రైలును ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పశ్చిమ రైల్వే శాఖ అధికారి వెల్లడించారు. ముంబై చేరాక దాన్ని తిరిగి అమర్చినట్టు తెలిపారు. గత నెల 30 తర్వాత ఈ తరహా ఘటన మూడోది. ఈ నెల 6న, 7న రెండుసార్లు వందేభారత్ రైలు ప్రమాదానికి గురైంది. చిన్నపాటి ప్రమాదాలకే రైలు దెబ్బతినడంపై విమర్శలు వస్తున్నాయి.