(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కర్ణాటకతో పాటు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ‘వాల్మీకి కార్పొరేషన్’ స్కామ్‌లో పాత్రధారిగా ఉండి, సస్పెన్షన్‌కు గురైన అధికారికి కర్ణాటక ప్రభుత్వం తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. కార్పొరేషన్‌కు గతంలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించి సస్పెన్షన్‌కు గురైన కల్లేశ్ను కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏవో)గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వాల్మీకి కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల వినియోగంపై వివరాలు ఇవ్వడంలో కల్లేశ్ ఉద్దేశపూర్వకంగా జాప్యం వహించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ఈ స్కామ్‌లో ఆయన పాత్ర కూడా ఉన్నదని విపక్షాలు ఆరోపించాయి. దీంతో సర్వత్రా ఒత్తిళ్లు రావడంతో గత జూన్‌లో ఆయన్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే, మూడు నెలలు గడువకముందే ప్రభుత్వం కల్లేశ్కు మళ్లీ కీలక పోస్టింగ్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.