పేదల కోసం ‘టీకా వోచర్’!

- వారికి ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఎలక్ట్రానిక్ వోచర్‌తో ఆర్థిక సాయం చేయవచ్చు
- జనాభా, వైరస్ తీవ్రతను బట్టి రాష్ర్టాలకు టీకాలు
- వృథా ఎక్కువుంటే కేటాయింపుల్లో కోత
- వ్యాక్సినేషన్‌పై కేంద్రం సవరణ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, జూన్ 8: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా అందించడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారికి వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు ఆర్బీఐ ఆమోదిత ఎలక్ట్రానిక్ వోచర్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్టు తెలిపింది. ఈ వోచర్లను ప్రైవేట్ సెంటర్లలో రిడీమ్ చేసుకోవచ్చని వెల్లడించింది. జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై కేంద్రం మంగళవారం సవరణ మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నెల 21 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.
నూతన మార్గ దర్శకాలు
- రాష్ర్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రమే ఉచితంగా టీకాలను అందిస్తుంది. జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా ఆయా రాష్ర్టాలకు టీకాలను కేటాయించనున్నది.
- టీకాల వృథా ఎక్కువగా ఉన్న రాష్ర్టాలకు వ్యాక్సిన్ కేటాయింపుల్లో కోత పడనుంది.
- ప్రధాని మోదీ ప్రకటించినట్లుగానే, వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి 75 శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేయనున్నది. వీటిని రాష్ర్టాలకు ఉచితంగా అందిస్తుంది. ప్రభుత్వ టీకా కేంద్రాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ర్టాలు ప్రజలందరికీ ఈ టీకాలను ఉచితంగా అందజేస్తాయి.
- టీకా పంపిణీలో ప్రాధాన్య క్రమం ఎలా ఉండాలంటే.. 1.ఆరోగ్య కార్యకర్తలు 2.ఫ్రంట్‌లైన్ వర్కర్లు 3. 45 ఏండ్లు పైబడినవారు 4. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 5. 18 ఏండ్లు నిండినవారు.
- 18 ఏండ్లు పైబడినవారిలో ప్రాధాన్యక్రమాన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతా లే సొంతంగా నిర్ణయించుకోవచ్చు.
- లోకకల్యాణం స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు, పేదలకు ప్రైవేట్ కేంద్రాల్లో టీకా అందించేలా ప్రజలు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు నాన్ ట్రాన్స్ఫరబుల్ ఎలక్ట్రానిక్ వోచర్లు తీసుకురానున్నారు.
- ప్రైవేట్ దవాఖానలకు అందించే టీకాల ధరలను తయారీ సంస్థలు ముందుగానే ప్రకటించాలి. ఒక్కో డోసుకు సేవా రుసుం గరిష్ఠంగా రూ.150 మాత్రమే.
- ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉచిత టీకాకు అర్హులే.
- టీకా కోసం ప్రజలు కొవిన్ పోర్టల్‌తోపాటు టీకా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- రాష్ర్టాలు కామన్ సర్వీస్ సెంటర్లు, కాల్ సెంటర్ల ద్వారా టీకా ముందస్తు రిజస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలి.
వ్యాక్సిన్ తయారీ సంస్థ జీఎస్టీ సేవారుసుం ప్రైవేట్ దవాఖానల్లో ప్రకటించిన ధర గరిష్ఠ ధర
కొవిషీల్డ్ 600 30 150 780
కొవాగ్జిన్ 1200 60 150 1410
స్పుత్నిక్‌వీ 948 47 150 1145
44 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్లు
దేశంలో 18 ఏండ్లు నిండినవారందరికీ ఉచితంగా టీకా వేయించే బాధ్యత తనదేనని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం 44 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్లు ఇచ్చింది. 25 కోట్ల కొవిషీల్డ్ డోసుల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థకు ఆర్డర్ ఇవ్వగా, 19 కోట్ల కొవాగ్జిన్ డోసుల కోసం హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఆగస్టు-డిసెంబర్ మధ్యలో ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. టీకాల సేకరణ కోసం ఈ రెండు సంస్థలకు అదనంగా 30 శాతం అడ్వాన్స్ చెల్లించినట్టు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

