Murder : సోదరుడి హత్య కేసు వాపస్ తీసుకోలేదని ఓ 35 ఏళ్ల వ్యక్తిని ఐదుగురు దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మరీ కాల్చిచంపారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం ముజఫర్నగర్ (Muzaffarnagar) జిల్లాలోని బిజోపురా గ్రామం (Bijopura village) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం జైద్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. జైద్ సోదరుడు అస్లా కళ్ల ముందే ఈ హత్య జరిగింది. దాంతో అస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం మీరట్ కోర్టు ఈ కేసులో విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో కేసును వాపస్ తీసుకోవాలని ఇర్ఫాన్ అనే నిందితుడు అస్లాంను బెదిరించాడు. కానీ అస్లాం కేసును వాపస్ తీసుకోలేదు.
దాంతో ఇర్ఫాన్ మరో నలుగురితో కలిసి అస్లాం హత్యకు కుట్రపన్నాడు. ఆ మేరకు అస్లాంను గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కాల్చి చంపారు. అనంతరం నిందితులు పారిపోయారు. ఘటనపై అస్లాం మరో సోదరుడు నౌషద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.