Uttarkashi tunnel collapse | సొరంగం కూలిన ఘటనలో 40 మంది కార్మికులు సేఫ్.. పైపుల ద్వారా ఆక్సిజన్, నీరు సప్లై
Uttarkashi tunnel collapse | ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశి (Uttarkashi) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం (Tunnel) కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 40 మంది కార్మికులు (Workers) అందులో చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు టన్నెల్లో చిక్కుకుపోయిన వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
Uttarkashi tunnel collapse | ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశి (Uttarkashi) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం (Tunnel) కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 40 మంది కార్మికులు (Workers) అందులో చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు టన్నెల్లో చిక్కుకుపోయిన వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. బాధితులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. సొరంగంలో నీటి సరఫరా కోసం వేసిన పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ (Oxygen) సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక అదే పైపు ద్వారా తాగునీరు (Drinking water), ఆహార (Food) పదార్థాలను కూడా సప్లై చేస్తున్నట్లు సీనియర్ అధికారి ప్రశాంత్ కుమార్ వివరించారు.
బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్గావ్ వరకు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి టన్నెల్ ఒక్కసారిగా కూలిపోవడంతో (Collapse) కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వారికి బయటకు రావడానికి మార్గం మూసుకుపోయింది. సమాచారం అందుకున్న కేంద్ర, రాష్ట్ర డిశాస్టర్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. కార్మికులను బయటకు క్షేమంగా తీసుకొచ్చేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తయేందుకు రెండు నుంచి మూడు రోజులు పట్టొచ్చని ఉత్తరకాశి ఎస్పీ అర్పన్ యదువంశి చెప్పారు. టన్నెల్ ఆరంభం నుంచి 200 మీటర్ల దూరంలో కూలిపోయిందని తెలిపారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, వీలైన త్వరలో చిక్కుకుపోయినవారిని క్షేమంగా బయటకు తీసుకొస్తామన్నారు.
Also Read..
helicopter | సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు అమెరికా సైనికులు మృతి
Rishi Sunak | దీపావళి సందర్భంగా రిషి సునాక్‌కు ప్రత్యేక బహుమతి అందించిన కేంద్ర విదేశాంగ మంత్రి
Air pollution | ఢిల్లీలో మరింత తీవ్రంగా ఎయిర్ పొల్యూషన్.. సుప్రీంకోర్టు ఆదేశాలు భేఖాతర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

