డెహ్రాడూన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. తాజాగా ఉత్తారఖండ్లో కుంభవృష్టి కురిసింది. దాంతో శ్రీనగర్, పౌరీ గర్వాల్లోని పలు ఏరియాల్లో భారీగా వరద నీరు నిలిచింది. అలక్నందా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అలక్నందా, ధౌలిగంగా పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. అలక్నందా నది ఉగ్ర రూపానికి సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH | Uttarakhand: Several low lying areas in Srinagar, Pauri Garhwal submerged in water after the water level rose in Alaknanda river due to heavy rainfall pic.twitter.com/Kk8HLJ1MU7
— ANI (@ANI) June 19, 2021