డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత ప్రేమ్చంద్ అగర్వాల్ నడిరోడ్డుమీద ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మంత్రి సురేంద్ర సింగ్.. నేగి అనే బాధితుడి చెంప చెళ్లుమనిపించడంతో పాటు తన అనుచరులు, భద్రతా సిబ్బందితో కలిసి వెంటబడి మరీ చితకబాదారు. రిషికేశ్ పట్టణంలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఇలాగేనా ప్రవర్తించేది? అని కాంగ్రెస్ మండిపడింది. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, లేదా సీఎం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
భోపాల్ : మధ్యప్రదేశ్లో దళిత యువకుడి పెండ్లి ఊరేగింపుపై అగ్రకులానికి చెందిన కొందరు మారణాయుధాలతో దాడి చేశారు. ఆదివారం దేవాస్ జిల్లాలో పెండ్లి కొడుకు దీపక్ సోలంకిని గుర్రంపై ఊరేగిస్తుండగా దాదాపు 12 మంది అడ్డగించారు. గుర్రంపై నుంచి కిందకు దించి దాడి చేశారు.