డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హర్బాన్స్ కపూర్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో మరణించారు. ఆదివారం రాత్రి డెహ్రాడూన్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. హర్బాన్స్ కపూర్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు కలిపి మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా కూడా ఆయన పనిచేశారు.
కాగా, హర్బాన్స్ కపూర్ మృతికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హర్బాన్స్ కపూర్‌కు సంబంధించిన గత జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు. ఇదిలావుంటే హర్బాన్స్ కపూర్ మృతి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా ఒకచోట చేరి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.
Dehradun: Congress leaders observe 2-minute silence on the demise of former Uttarakhand Assembly Speaker and senior BJP leader Harbans Kapoor pic.twitter.com/UWGZw6qkCl
— ANI (@ANI) December 13, 2021