12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్న పలు రాష్ట్రాలు..!
12th class Exams: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాదికి 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్న రాష్ట్రాలు.. ఇప్పుడు ఆ పరీక్షలను పూర్తిగా రద్దు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ ఏడాదికి 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాదికి 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత రాత్రి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ పలు రాష్ట్రాలు ఆయా బోర్డుల పరిధిలోని 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

