లక్నో: రీల్స్‌తో పాపులర్ కావాలన్న పిచ్చితో కొందరు పిల్లలు చేసిన ప్రయత్నం ప్రాణాంతకంగా మారింది. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్నగర్లో శనివారం ఐదుగురు పిల్లలు 60 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్‌ట్యాంక్ ఎక్కి.. ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. సరైన అవగాహన లేకుండా వీరు చేసిన ఈ సోషల్‌మీడియా స్టంట్ భయానకంగా మారింది.
ముగ్గురు పిల్లలు వాటర్‌ట్యాంక్ పై నుంచి కిందికి దిగుతుండగా, వారి బరువుకు అక్కడి నిచ్చెన విరిగిపోయింది. దీంతో ఆ ముగ్గురు పిల్లలు 50 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడిపోయారు. ఈ ఘటనలో 13 ఏండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు పిల్లలు వాటర్ట్యాంక్పైన్నే చిక్కుకోగా, ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌తో వారిని సురక్షితంగా కిందికి చేర్చారు.