Uttar Pradesh | లక్నో: తన కూతురు మామ (వియ్యంకుడు)తో కలిసి ఓ మహిళ పారిపోయింది. ఇంట్లోని నగలు, నగదును వెంట తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన ఇద్దరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్ బుదౌన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
43 ఏండ్ల మమతకు నలుగురు పిల్లలు. ఆమె భర్త లారీ డ్రైవర్. కూతురి మామతో మమతకు వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. భర్త లేనప్పుడు వియ్యంకుడిని తన ఇంటికి పిలిపించి, ఏప్రిల్ 11న అతడితో కలిసి మమత పారిపోయినట్టు తెలిసింది.