లక్నో, జూలై 9: చాలా ఏండ్ల పాటు జైల్లో ఉన్న ఓ ఘరానా దొంగ.. జైలు నుంచి బయటకు రాగానే చేసిన పని అక్కడి వాళ్లలో వణుకు పుట్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో పేరుమోసిన దొంగ గంగా ప్రసాద్. అతడిపై అనేక కేసులున్నాయి. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు.
ఇతడికి బతికున్న పాముల్ని పట్టుకుని.. వాటిని చంపి, తినే అలవాటుందట! జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే పాముల్ని తినేందుకు తపించిపోయాడు! నది ఒడ్డుకు పోయి.. నీళ్లలో నుంచి ఓ పామును తీసి, దాని మెడను కొరికి, కరకరా నమిలి తినేశాడు. ఇదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇన్నాండ్ల జైలు జీవితం అతడిలో ఎలాంటి మార్పూ తీసుకురాలేదని సోషల్‌మీడియాలో పలువురు కామెంట్ చేశారు.