Yogi Adityanath: షూటర్ యోగి ఆదిత్యనాథ్.. అజాల్ట్ రైఫిల్‌తో ఫోజిచ్చిన యూపీ సీఎం
Yogi Adityanath: ఆర్మీ రైఫిల్‌ను చెక్ చేశారు యూపీ సీఎం. నో యువర్ ఆర్మీ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. లక్నోలో ప్రదర్శనకు ఉంచిన ఆధునిక ఆయుధాలను పరిశీలించారు. అజాల్ట్ రైఫిల్‌ను పట్టుకుని షూటర్ తరహాలో టార్గెట్ సెట్ చేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath).. ఇవాళ లక్నోలో నో యువర్ ఆర్మీ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ఏర్పాటు చేసిన తుపాకులను పరిశీలించారు. ఆర్మీ వాడే ఆధునిక ఆయుధాలను ఆ ఈవెంట్లో ప్రదర్శించారు. ట్యాంకులు, ఆర్టిల్లరీ గన్స్‌తో పాటు వివిధ రకాల తుపాకులను ప్రదర్శనలో ఉంచారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లోనూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ ఈవెంట్‌కు చెందిన ఫోటోలను పోస్టు చేశారు.
लखनऊ में आज से आयोजित तीन दिवसीय ‘Know Your Army Festival-2024’ के उद्घाटन कार्यक्रम में सम्मिलित हुआ।
इस समारोह के माध्यम से हमारे युवाओं को भारतीय सेना को जानने और उनके शौर्य व पराक्रम से साक्षात्कार का अवसर प्राप्त होगा।
इस समारोह के लिए भारतीय सेना को हृदय से बधाई! pic.twitter.com/Pp1ECo28pN
— Yogi Adityanath (@myogiadityanath) January 5, 2024
భారతీయ సైన్యం గురించి యువత తెలుసుకునేందుకు ఇదో మంచి అవకాశం అని పేర్కొన్నారు. ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల ఆయుధాలను ఆయన తిలకించారు. ఆ ఈవెంట్లో రైఫిల్‌ను పట్టుకున్నారు. షూటర్ తరహాలో ఆ అజాల్ట్ రైఫిల్‌తో ఆయన ఫోజు ఇచ్చారు. రైఫిల్‌తో షూటర్ తరహాలో టార్గెట్‌ను చూశారు. ఆ ఘటనకు చెందిన వీడియోను చూడండి.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath inaugurates ‘Know Your Army Festival’ in Lucknow. pic.twitter.com/qnacC3iG9W
— ANI (@ANI) January 5, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

