US spokesperson | రాహుల్ వ్యాఖ్యలను ఒప్పుకోం గాక ఒప్పుకోం : అమెరికా
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో సహా పలు విధానాలు అత్యంత లోపభూయిష్టమైనవని మండిపడ్డారు. చైనాను, పాక్‌ను వేరుచేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యంగా వుండాలని, కానీ మోదీ ఆ రెండు దేశాలను కలిపేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. అయితే ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాక్, చైనా విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రమూ ఆమోదనీయం కావని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ప్రైజ్ అన్నారు.
చైనా, పాక్ సంబంధాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన కామెంట్స్‌పై స్పందించాలని నెడ్ప్రైజ్ను మీడియా కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ‘రాహుల్ చేసిన వ్యాఖ్యలను చైనా, పాకిస్తాన్‌కే వదిలేస్తున్నాం. అయితే తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించం.’ అని నెడ్ప్రైజ్ స్పష్టం చేశారు. అయితే ప్రపంచ యవనికలో ఏ దేశం ఎవరితో సంబంధాలు నెరపాలన్నది తాము నిర్దేశించమని, అమెరికా, చైనా చుట్టే తిరగమని తామేమీ చెప్పమని ఆయన పేర్కొన్నారు. ఎవరి ఎవరికి మద్దతివ్వాలన్నది అది వారి వారి ఛాయిస్ అని, అయితే అమెరికాకు మద్దతివ్వని దేశాలతో మాత్రం తాము సత్సంబంధాలను నెరిపే ప్రసక్తే లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ప్రైజ్ తేల్చి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

