మోదీతో రూబియో భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో శనివారం సమావేశమయ్యారు. భారత్-అమెరికాల మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం, పురోగతిపై ఇద్దరు నేతలు చర్చించారు.
- ద్వైపాక్షిక సహకారంపై చర్చ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో శనివారం సమావేశమయ్యారు. భారత్-అమెరికాల మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం, పురోగతిపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరపున త్వరలో వైట్‌హౌస్‌ను సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీని రూబియో ఆహ్వానించారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ఈ భేటీకి సంబంధించిన వివరాలు తెలిపారు. ‘భారత్- అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతిపై, ప్రపంచ శాంతి భద్రతలపై చర్చించామని, ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసి పని చేస్తూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు. రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు తదితర రంగాలలో భారత్- అమెరికా సహకారంపై రూబియో ప్రధానికి వివరించినట్లు పీఎంవో తెలిపింది. పశ్చిమాసియా పరిస్థితి సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ప్రధానికి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

