Marco Rubio | న్యూఢిల్లీ, మే 8: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉభయ దేశాలకూ పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు.
ఇరుదేశాల మధ్య చర్చలకు యూఎస్ మద్దతు ఉంటుందని, సంప్రదింపులు జరగాలని ఆకాంక్షించారు. హల్గాం ఉగ్రదాడిని ఖండించిన రూబియో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జరిపే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.